Home / ANDHRAPRADESH / సీపీఐ, సీపీఎం పార్టీలు మరో చారిత్రక తప్పిదం చేస్తున్నాయా..!

సీపీఐ, సీపీఎం పార్టీలు మరో చారిత్రక తప్పిదం చేస్తున్నాయా..!

మరో చారిత్రక తప్పు చేయడానికి ఎర్ర పార్టీల అధినేతలు సిద్దమయ్యారు. స్వాతంత్యం వచ్చిన దగ్గర నుంచి ఇలా చారిత్రక తప్పులు చేస్తూనే చివరకు ఉనికిలో లేకుండా పోయాయి సీపీఐ, సీపీఎం పార్టీలు. ఎన్ని తప్పులు చేసినా వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవడానికి ఎర్ర పార్టీలు సిద్ధంగా ఉండవు. ఒకప్పుడు దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాల ప్రజల తరపున ప్రజా ఉద్యమాలు నిర్మించిన ఎర్ర పార్టీలలో కులతత్వం, ప్రాంతీయతత్వం, వ్యక్తిగత స్వార్థం పెరిగిపోయావో అప్పుడే వాటి పతనం మొదలైంది.. సామ్రాజ్యవాదం, కార్పొరేట్ శక్తులు అంటూ పడికట్టు పదజాలం వాడే ఎర్రన్నలు అదే కార్పొరేట్ శక్తులకు వంతపాడుతున్నాయి.

 

ఒకప్పుడు తెలుగు రాజకీయాలను శాసించిన సీపీఐ, సీపీఎం పార్టీలు ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం కొన్నేళ్లుగా రెండు పార్టీలు ఒకే సామాజికవర్గం ఆధిపత్యంలోకి వెళ్లిపోవడమే..అవును సీపీఎం అధినేత రాఘవులు, సీపీఐ అధినేత నారాయణలు ఇద్దరూ…కమ్మ సామాజికవర్గమే..వీరి హయాంలోనే ఎర్ర పార్టీలు వారి భాషలో చెప్పుకునే బూర్జువా పార్టీలకు తోక పార్టీలుగా మిగిలిపోయాయి. బడుగులకు బాసటగా నిలిచే ఎర్ర పార్టీలను చంద్రబాబులాంటి కులప్రభువుకు తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకువచ్చింది…ఈ ఇద్దరు నాయకులే..పేరుకు చంద్రబాబును వ్యతిరేకిస్తారు కానీ..సామాజికపరంగా వస్తే మాత్రం బాబుకు వత్తాసుపలకడానికి ఈ ఇద్దరు నాయకులు ఏ మాత్రం వెనుకాడరు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించిన చంద్రబాబును ఫాసిస్ట్ అని తిట్టిన ఎర్రన్నలు 2009లో అదే బాబుతో పొత్తు పెట్టుకుని మహాకూటమిగా పోటీ చేశారు. అలాగే తమతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు 2014లో తమను కాదని..తమ ఆగర్భశత్రువు మోదీతో పొత్తుపెట్టుకున్నా వీరు పెద్దగా బాధపడరు..ఎందుకంటే అధికారంలో తమ కులమే ఉండాలన్నదే ఈ ఇద్దరు ఎర్రన్నల అంతర్గత లక్ష్యం..పైకి చంద్రబాబును చీల్చి చెండాడినట్లు కనిపించే ఈ ఎర్రన్నలు లోలోపల మాత్రం తమ కులపోడు రాజ్యమేలుతున్నాడంటూ తాపీగా కూర్చుంటారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో కూడా కేవలం చంద్రబాబు చెప్పడనే కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిగా పోటీ చేసి మట్టికరిచాయి…ఈ ఎర్ర పార్టీలు.

 

అయితే 2019 ఏపీ ఎన్నికల్లో మాత్రం జగన్ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. పాపం జగన్‌ది ఎప్పుడూ ఒంటరిపోరాటమే..ఎన్నికల్లో చంద్రబాబుతో విబేధించినట్లు కనిపించిన రెండు ఎర్ర పార్టీలు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నారే కానీ..జగన్‌తో మైత్రి కోసం ఏనాడు ప్రయత్నించలేదు. అయితే జగన్‌ కూడా తనకు ఎవరి మద్దతు అవసరం లేకున్నా గెలుస్తానని ధీమాతో ఎన్నికలకు వెళ్లాడు..అఖండ విజయం సాధించాడు. ఎర్ర పార్టీలు అడ్రస్ లేకుండా పోయాయి.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సీపీఐ, సీపీఎం పార్టీలు ఉనికి ప్రశ్నార్థంగా మారింది. ఈ తరుణంలో మళ్లీ తాడిత, పీడిత, దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేయాల్సిన ఎర్ర పార్టీలు తమ సామాజికవర్గ ప్రయోజనాలకు పెద్ద పీట వేయడం బాధాకరం.

 

తాజాగా ఏపీ సీఎం జగన్ మూడు రాజధానులపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం మూడు రాజధానులు వద్దు..తన సామాజికవర్గం ఎక్కువగా ఉండే అమరావతి ముద్దు..అంటూ రాజధాని రైతులను రెచ్చగొడుతున్నాడు. ఆఖరకు సీపీఐ నారాయణ, సీపీఎం రాఘవులు కూడా అమ్మరావతి పాట కమ్మగా పాడుతున్నారు. రాజధానులను ముక్కలు చేయడం ఏంటని రాఘవులు సీఎం జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. చికెన్ నారాయణ గారు కూడా అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలి..మూడు రాజధానులు వద్దు అంటూ కమ్మటి కబుర్లు చెబుతున్నారు. ఒకప్పడు ఇదే ఎర్రన్నలకు ఉత్తరాంధ్ర పెద్దపీట వేసింది. నక్సల్బరీ ఉద్యమం ఉత్తరాంధ్రలోనే మొదలైందన్న విషయాన్ని వీరు మర్చిపోయారు. ఉత్తరాంధ్రలో ఎన్నో ప్రజా ఉద్యమాలను నిర్మించిన సంగతి కూడా ఎర్రన్నలు మర్చిపోయారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర కంటే.. అమరావతి వీరికి ఇప్పుడు ముఖ్యమైపోయింది. తమ సామాజికవర్గం ఎక్కువగా ఉండే అమరావతి అన్యాయమైపోతుందని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. కానీ.. రాజధాని ఏర్పాటుతో గిరిజన, దళిత, బడుగు, బలహీనవర్గాలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్న సోయి కూడా వీరికి లేకుండా పోయింది. కేవలం కులాభిమానంతో కళ్లుమూసుకుపోయిన ఎర్రన్నలు చంద్రబాబుతో కలిసి అమరావతి పాట “కమ్మ”గా పాడుతున్నారు. అట్టడుగు వర్గాల ప్రజల ఆకాంక్షల కంటే..ఎర్ర పార్టీల అధినేతలకు తమ సామాజికవర్గ ప్రయోజనాలకే ఎక్కువైపోయాయి. ఇది ఎర్ర పార్టీలు చేస్తున్న మరో చారిత్రక తప్పిదం..ఇప్పటికే సమాధి అయిన ఈ రెండు పార్టీలు పూర్తిగా పాతాళానికి పోయేందుకు సిద్దమవుతున్నాయి. .హతవిధీ..ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat