అమరావతిలో రైతుల పేరుతో చేస్తున్న ఆందోళనల కార్యక్రమాలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కొందరు వ్యక్తులు పథకం ప్రకారం దాడి చేశారు. టీవీ జర్నలిస్ట్ దీప్తిని మహిళ అని కూడా దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారు. తమ తోటి మహిళా జర్నలిస్ట్‌ను కాపాడేందుకు అడ్డుపడిన మరో ముగ్గురు జర్నలిస్టులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో మీడియా వాహనాలను ధ్వంసం చేశారు. తమకు సదరు మీడియా ఛానళ్లు నచ్చకపోతే..శాంతియుతంగా వెనక్కి వెళ్లమని కోరవచ్చు..కాని ఇలా దాడి చేయడం ఏంటో ఆందోళనకారులకే తెలియాలి. నిజమైన రైతులు ఎవరూ ఇలా మహిళలపై దాడి చేయరు..ఇది కేవలం ఒక పార్టీ కుట్రలో భాగంగా జరిగిందనే గమనించాలి. అయితే తమపై దాడికి పాల్పడిన వారిపై బాధిత జర్నలిస్టులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇంకేముంది బాబుగారు రైతుల పేరుతో తనదైన రోత రాజకీయం మొదలెట్టాడు. వెంటనే వెళ్లి ఆ దాడి చేసిన వ్యక్తులను పరామార్శించాడు. రైతులపై అటెంప్ట్ మర్డర్ కేసులు ఎలా పెడతారని చంద్రబాబు ప్రశ్నించారు. ఆందోళనలు చేస్తున్న రైతులను దొంగలుగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారమే డీజీపీ తప్పుడు పనులన్నీ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. దీనికి కారణమైన పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మూడు రాజధానుల విషయంలో ఒక్క అమరావతి ప్రాంతం తప్ప.. మిగిలిన ప్రాంతాల టీడీపీ నేతలు సానుకూలంగా ఉన్నారు. దీంతో అమరావతిలో ఆందోళనలను హింసాత్మకం చేసేందుకే పక్కా పథకం ప్రకారం జర్నలిస్టులపై దాడి జరిగిందని తెలుస్తోంది. అయితే ఇవాళ చట్టం తన పని తాను చేసుకుపోయింది…బాధిత జర్నలిస్టుల ఫిర్యాదులపై పోలీసులు దాడికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.అసలు ఎంత ఆగ్రహం ఉన్నా…నిజమైన రైతులు ఇలాంటి దాడులకు పాల్పడరు…ఒక వేళ చేసినా..అది టీడీపీ కుట్రలో భాగమే అని చెప్పక తప్పదు..అందుకేనేమో చంద్రబాబు రైతుల పేరుతో రోత రాజకీయం మొదలెట్టాడు.
