ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాజధాని ప్రాంతం అమరావతిలో బిగ్ షాక్ తగలనున్నది. తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యే అధికార వైసీపీ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు అస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ ఛానెల్ ఖరారు చేసింది.
రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మద్దాలి గిరి అధికార వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు. ఈ రోజు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఒక ముఖ్యమైన కార్యక్రమానికి హాజరవ్వకుండా మద్దాలి గిరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఇప్పటికే అమరావతి నుండి రాజధాని తరలించడాన్ని మొదటి నుండి టీడీపీ వ్యతిరేకిస్తూ మరోవైపు ఫెయిడ్ ఆర్టిస్టులతో ధర్నాలు.. రాస్తోరోకులు నిర్వహిస్తున్న క్రమంలో గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే టీడీపీని వీడటం ఆ పార్టీకి బిగ్ షాక్ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.