టీడీపీ అధినేత చంద్రబాబుకు 2019 ఏడుపుగొట్టు సంవత్సరంగా మిగిలిపోయింది. ఈ ఏడాదిలోనే టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోర పరాజయం పాలైంది. ఏ 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అధికారంలో ఉన్నప్పుడు లాక్కున్నాడో అదే 23 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రజలు గుణపాఠం చెప్పారు. ఐదేళ్ల పాటు గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతూ..అవినీతి, అరాచకం, దోపిడే పరమావధిగా సాగిన చంద్రబాబు పాలనకు ఏపీ ప్రజలు చరమగీతం పాడింది ఈ ఏడాదిలోనే. అంతేనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబుగారు 47 ఏళ్ల యువకుడు జగన్ పాలన ముందు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ ఏడాదిలోనే ఎదురైంది. అదేంటో ఈ ఏడాది మొత్తం బాబుగారికి శాపనార్థాలు, పెడబొబ్బలు, చావురాగాలతో సరిపోయింది. అధికారం పోగానే బాబుగారు రోజూ టిఫిన్ చేసి ఇంట్లో కూర్చుంటే.. తెలుగు తమ్ముళ‌్లు కూలీ ఇచ్చి తీసుకువచ్చిన ఓ పది మంది జనాలు వచ్చి నువ్వు ఓడిపోవడం ఏంటయ్యా అంటూ..ఏడ్చేవారు. ఇలా ఓ పది రోజులు బాబుగారు తనకు తానే ఓదార్పుపేరుతో సంతాప యాత్రలు చేసుకున్నారు. కొన్నాళ్లు రాజధాని తరలింపుపై రంకెలు వేశారు. మరి కొద్ది రోజులు పల్నాడులో మా టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ బాబుగారు పెడబొబ్బలు పెట్టారు. పునరావాస కేంద్రాలు పెట్టి తన పరువు తానే తీసుకున్నాడు. ఆ తర్వాత కోడెల ఆత్మహత్యపై చావు రాగాలు తీశారు. ఆ ఎపిసోడ్ అయ్యాక ఇసుక కొరత అంటూ ఇసుకో..ఉస్కో అంటూ ఓ 20 రోజులు బాబుగారు తన తొడ తానే పిసుక్కున్నారు. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంపై ఆక్రోశం వెళ్లగక్కాడు…..ఇప్పుడేమో నా బంగారు బాతు అమరావతిని చంపేశారు ఓ దేవుడా…అంటూ తెగ ఏడుస్తున్నాడు. మొత్తంగా 2019 బాబుగారికి ఏమాత్రం కలిసిరాలేదు..ఏడుపుగొట్టు సంవత్సరంగా మిగిలిపోయింది..
