ఏపీ ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటీ లో పది మంది మంత్రులు, ఆరుగురు అదికారులు సభ్యులుగా ఉంటారు. మూడు రాజదానుల అంశంలో జిఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదిక తదితర నివేదికలను పరిశీలించి ఈ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ కమిటీలో ప్రదానంగా కోస్తా జిల్లాల మంత్రులు ఉండడం విశేషం. మేకపాటి గౌతం రెడ్డి,ఆదిమూలం సురేష్, సుచరిత, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పేర్ని నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ కన్నబాబు ,బొత్స సత్యనారాయణ లు సభ్యులుగా ఉన్నారు. ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి కన్వీనర్ గా ఉంటారు. డిజిపి గౌతం సవాంగ్ , ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం,లాండ్ కమిషనర్ తదితరులు ఉంటారు. ఛీప్ సెక్రటరీ నీలం సహాని కన్వీనర్ గా ఉంటారు. హైదరాబాద్ కు ధీటుగా విశాఖను అబివృద్ది చేయడంతో పాటు ఇతర జిల్లాల అబివీద్దిపై ఈ కమిటీ సిఫారస్ లు చేస్తుంది.
