ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటినుండి విశాఖపట్నం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దీనికి ముఖ్య ఉదాహరణ రాజధాని ప్రతిపాదన అని కూడా చెప్పొచు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఏకంగా రూ.1285.32 కోట్ల పెట్టి అభివృద్ధి కొరకై శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. విశాఖ విమానాశ్రయం దగ్గరనుండి జగన్ రోడ్ మార్గంలో కైలాసగిరి వరకు ర్యాలీగా వెళ్లి రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత రూ.37 కోట్లతో ప్లానెటోరియా నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం వైఎస్సార్ సెంట్రల్ పార్క్‌కు వెళ్లి జీవీఎంసీ చేపట్టనున్న రూ.905.50 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు.