సూపర్ స్టార్ మహేష్ హీరోగా, కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ అమితాబ్ విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటించాబోతుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీప్రసాద్ తీసుకున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పిక్స్, సాంగ్స్ తో ఇప్పటికే ఫుల్ జోష్ లో ఉంది. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పార్టీ సాంగ్ అది కూడా అందులో తమన్నా ఉండడంతో దానికోసమే ఎదురుచూస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈరోజు విశాఖ ఉత్సవ్ లో భాగంగా సాయంత్రం 7.02 నిమిషాలకు ఈ సాంగ్ ప్రోమో విడుదలచేస్తునట్టు ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
