టాలీవుడ్ సంచలన మరియు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. ముంబై అండర్ వరల్డ్ ఆదారంగా వెబ్ సిరీస్ తీస్తానని చెప్పాడు. ఈ సిరీస్ లో ముఖ్యంగా మాఫియా కింగ్ దావూద్ ఇబ్రహీం పైనే ఫోకస్ చేసాడు. అంతకముందు వర్మ ముంబై లో మాఫియా ఎలా నడుస్తుంది అనేదానిపై చాలా సినిమాలు తీసాడు. ఇక ఆర్జీవీ అయితే నేను రెండు దశాబ్దాలుగా చాలా విషయాలు తెలుసుకున్నానని. నా దగ్గర ఉన్న కధకి వెబ్ సిరీస్ న్యాయం చేస్తుందని అన్నారు.దీనికి సంబంధించి మిగతా వివరాలు త్వరలోనే చెబుతానని అన్నారు.