నందమూరి బాలయ్య హిట్ సిన్మా లక్ష్మీ నరసింహ సీన్‌లో ఇంట్రో సీన్ గుర్తుందా..మన బాలయ్యబాబు బీర్‌తో మొహం కడుక్కుని, అదే బీర్‌ను ఇాడ్లీలో కలుపుకుని తింటాడు…ఆ సమయంలో ఎస్‌ఐ వేషంలో దొంగతనం చేసి వేసి వెళుతున్న దొంగ పోలీసును పట్టుకుని చితకదన్ని..పోలీసులను అరెస్ట్ చేయమంటాడు…నువ్వెవరు అరెస్ట్ చేయమని చెప్పేందుకు అంటే..కుమారస్వామి, కుప్పు స్వామి అంటూ పేర్లు ఓ అరడజను పేర్లు చదివి నా పేరు లక్ష్మీ నరసింహ…డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ అంటూ వాళ్లకు క్లాస్ పీకుతాడు..సేమ్ టు సీమ్ రియల్ లైఫ్‌లో కూడా ఆ సీన్ దాదాపుగా రిపీట్ అయింది…అక్కడ రీల్ లైఫ్‌లో హీరో బాలయ్య అయితే..ఇక్కడ రియల్ లైఫ్‌లో హీరో ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్…ఇంతకీ ఎస్పీగారు ఏం చేశారనేదే కదా…మీ డౌట్..అయితే మీరు చూడండి…జిల్లాలో స్టేషన్‌కు ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన బాధితులతో పోలీసులు దురుసుగా వ్యవహరిస్తున్నారని ఎస్పీ దృష్టికి వచ్చింది. వెంటనే ఓ వ్యక్తిని ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు పంపించాడు.
ఆ వ్యక్తి తనది ఈ ఊరు కాదని, తనపై ఎవరో దాడి చేసి మొబైల్ ఫోన్ కొట్టేశారని ఓ ఫిర్యాదు రాసి రిసెప్షన్‌లో రాసిచ్చాడు. దాన్ని అక్కడ ఉన్న కానిస్టేబుళ్లు ఎవరూ పట్టించుకోలేదు సరి కదా..సీఐ గారు లేరు..మళ్లీ రా అంటూ ఆ వ్యక్తిని బయటకు పంపించారు. సాయంత్రం ఆ వ్యక్తి మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన ఫిర్యాదు గురించి అడిగాడు. ఐనా ఎవరూ సమాధానం చెప్పలేదు..బాబ్బాబు..నా సెల్‌ఫోన్ దొంగిలించారు..కాస్త చూడండి సార్ అంటూ బతిమాలితే వెధవ సోది అంటూ విసుక్కుంటూనే రైట్ దగ్గరకు పంపించారు. ఆ వ్యక్తి తన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ కాపీ అడుగగా..సీఐ గారు ఇంకా రాలేదు..వచ్చాక రా అని రైటర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. సార్..తాను గన్నవరం వెళ్లాలి..కనీసం ఫిర్యాదు చేసిన రసీదు అయినా ఇవ్వాలని ఆ వ్యక్తి పోలీసులను కోరాడు..దీంతో ఆ వ్యక్తి వదిలేలా లేడని భావించిన కానిస్టేబుళ్లు ఎస్‌ఐ దగ్గరకు పంపించారు. ఎస్‌ఐ కూడా సమాధానం సరిగా సమాధానం చెప్పకపోవడంతో ఆ వ్యక్తి తనకు ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేశాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించారంట…ఇంతకీ ఫిర్యాదు చేసిన ఆ వ్యక్తి ఎవరో కాదు ట్రైనీ ఐపీయస్ అధికారి జగదీష్..ఈ విషయం స్టేషన్‌లో ఉన్న పోలీసులకు తెలియదు.
పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించడంతో జగదీష్ వెంటనే ఈ విషయాన్ని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌కు తెలియజేశాడు. ఆయన వెంటనే రంగంలోకి దిగి తాలూకా స్టేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు..రైటర్‌ను సస్పెండ్ చేసి, సీఐ, ఎస్‌ఐ తో సహా నలుగురు కానిస్టేబుళ్లకు చార్జిమెమోలు జారీ చేశారు. ఫిర్యాదిదారుల పట్ల పోలీసులు సరిగా ప్రవర్తించడం లేదని తనకు తరచూగా కంప్లైంట్లు రావడంతో ఈ విధంగా ట్రైనీ ఐపీయస్ జగదీష్‌ను పంపించి అసలు వాస్తవ పరిస్థితిని తెలుసుకునాన్నని ఎస్సీ తెలిపారు. మొత్తంగా బాలయ్య సీన్‌ను ఎస్సీ సిద్ధార్థ్ కౌశల్ రిపీట్ చేశారు..ఈ న్యూస్ తెలిసిన ప్రజలు ఎస్సీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. పోలీసు స్టేషన్‌కు ఏదైనా కంప్లెంట్ ఇవ్వాలంటే భయపడే పరిస్థితి ఉందని…ఎస్పీగారు మంచి పని చేశారని..ప్రకాశం జిల్లా ప్రజలు ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇందుకేనేమో సీఎం జగన్ ఎప్పుడూ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌ను శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.