చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన కొన్ని నెల్లల్లోనే రాజధానిగా అమరావతిని పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే అంతకుముందే ఎదో అందరికి ఒకేసారి కల వచ్చినట్టుగా టీడీపీ నేతలు, చంద్రబాబు కులస్తులు అక్కడి రైతుల దగ్గర భూములు దౌర్జన్యంగా తీసుకున్నారు. అనంతరం అమరావతికి సంబంధించి అది చేస్తా ఇది చేస్తా అని మాటలు చెప్పి వేలకోట్లు కర్చుపెట్టి పెట్టుబడుల పేరుచెప్పుకొని విదేశీ ప్రయాణాలు చేసారు. కాని ఇంతకు అసలు విషయం ఏమిటంటే ఆయన వెళ్ళింది పెట్టుబడుల కోసం కాదు రియల్ ఎస్టేట్ వ్యపారంకోసమని తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇవ్వడం జరిగింది.”రాజధాని కోసం చంద్రబాబు మార్కెటింగ్ మేనేజర్ అవతారం ఎందుకెత్తారో ఢిల్లీ మీడియా వర్గాలకు అప్పట్లో అంతుబట్టలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని ఇప్పుడర్థమైంది.
ప్రజా ధనంతో దేశాలు తిరిగి అమరావతిపై ప్రెజెంటేషన్లిచ్చాడు. పెట్టుబడుల కోసమైతే వెనకబడిన జిల్లాల గురించి ప్రస్తావించొచ్చు కదా?” అని అన్నారు. చంద్రబాబు నిజంగా పెట్టుబడులు కోసమే వెళ్తే ఆయన అన్నట్లు వెనకబడిన జిల్లాల గురించి మాట్లాడాలి. కాని బాబుగారు మాత్రం తన సొంత కులస్తులు, పార్టీ వారికోసం కొన్ని వేలకోట్లు కుర్చుపెట్టి జల్సాలు చేసారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు ఆంధ్రరాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడా లేదా అమరావతికి మార్కెటింగ్ మేనేజరా అనే సందేహాలు వస్తున్నాయి. చివరికి గత ఐదేళ్లలో 65వేల కోట్ల పెండింగ్ బిల్లులతో కలిపి బాబు 2లక్షల కోట్ల అప్పు చేసి, మే30, 2019న దిగిపోతూ ఖజానా లో కేవలం 100కోట్లు ఇచ్చి వెళ్ళాడు.