2020 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు జీవితరాజశేఖర్ కూతుళ్లు. దేశమంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఈ న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేయాలి? ఎక్కడికి వెకేషన్ వెళ్ళాలి? అని ప్లాన్స్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు విదేశాలకు వెళ్లారు కూడా. ఇదే బాటలో జీవితరాజశేఖర్ కూతుళ్లు న్యూ ఇయర్ సంబరాల్లో మునిగిపోయారు. అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి పోతే.. కొత్త సంవత్సర సంబరం జీవితరాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మికలు న్యూ ఇయర్ సందర్భంగా సింగపూర్ వెళ్లారు. కొత్త సంవత్సరాన్ని అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. తమ స్నేహితులతో కలిసి వీళ్ళు వెకేషన్ టూర్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా అక్కడి అందమైన ప్రదేశాల్లో వాళ్ళు చేస్తున్న ఎంజాయ్ తాలూకు పిక్స్ షేర్ చేసింది శివానీ. సింగపూర్ లోని మరీనా బే సాండ్స్ రిసార్ట్స్‌లో బిల్డింగ్‌పై కట్టిన స్విమ్మింగ్ పూల్‌లో శివానీ, శివాత్మికలు బికినీలు వేసుకుని ఎంజాయ్ చేశారు. ఈ ఫోటోలను శివానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి.