2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే రాజధాని విషయంలో అమరావతి పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే రాజధానికి సంబంధించి కేంద్రం ఐదుగురు నిపుణులతో కూడిన తమిళనాడు ఐఏఎస్ శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఏపీలో మూడు నెలలు తిరిగి 50 కోట్లు ఖర్చు పెట్టి విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని వద్దు అని చెప్పింది. కాని చంద్రబాబు దీనిని కాదని సొంతంగా టీడీపీ మంత్రి నారాయణ కమిటీ అని ఒకటి వేసారు. ఈ నారాయణ రాజధాని కమిటీ లో సగం మంది కమ్మ కులస్తులు ఉన్నారు(టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ,గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చౌదరి, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ చైర్మన్ మండవ ప్రభాకర చౌదరి).
ఇక శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు విషయానికి వస్తే..!
- ప్రొఫెసర్ కె.శివరామకృష్ణన్ 1958 ఐఏఎస్ బ్యాచ్ అధికారి.
- ప్రొఫెసర్ కె.టి.రవీంద్రన్ న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో అర్బన్ డిజైనింగ్ విభాగానికి హెచ్.వో.డీగా ఉన్నారు.
- ప్రొఫెసర్ జగన్ షా.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ డైరెక్టర్.
- అరోమర్ రేవి.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్‌మెంట్స్ డైరెక్టర్.
- రతిన్ రాయ్…నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ రిసెర్చ్ డైరెక్టర్.
ఇలా ప్రతీ ఒక్కరు ఎంతో అనుభవం ఉన్నవారే. ఈ కమిటీ ఏపీలో మూడు నెలలు తిరిగి విజయవాడ గుంటూరు మధ్య రాజధాని వద్దు అని చెప్పింది. కాని చంద్రబాబు వారిని లెక్క చేయకుండా నారాయణ కమిటీ పెట్టి చివరికి అనుకున్నది సాధించారు. కేవలం సొంత కమ్మ కులస్థులు కోసమే అక్కడ రాజధాని పెట్టారు అని ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిబట్టి ప్రజలే చెప్పాలి ఎవరు ఎవరి స్వార్ధానికి అక్కడ రాజధాని పెట్టారో..?