రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్‌కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇన్ సైడ్ ట్రేడింగ్ విషయంలో ఏవేవో కబుర్లు చెబుతున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ” చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్సు సంతాప సమావేశంలా ఉంది. మీరు అంత నిప్పు, పత్తి గింజ అయితే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగనే లేదు. మా అందరికీ ఒకేసారి కల వచ్చి 4 వేల ఎకరాల భూములు కొనుగోలు చేశామని చెప్పండి. దీనిపై దర్యాప్తు చేసి మాపై పడిన నింద తొలగించమని సిబిఐని కోరండి. ఏం లేకపోతే మీకెందుకు భయం” అని అన్నారు.
