ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే వీరి ఆందోళన వెనుక తెలుగు దేశం పార్టీ ఉందనేది బహిరంగ రహస్యమే. రాజధాని కోసం భూములు త్యాగం చేశాం..ఇప్పుడు మా పరిస్థితి ఏంటని, మా జీవితాలను సీఎం జగన్ ఆగం చేశాడని అమరావతి రైతులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. అయితే కర్నూలు, వైజాగ్‌లలో రాజధానులు ఏర్పాటు అయితే…అమరావతి రైతులకు వచ్చిన బాధేంటో అర్థం కావడం లేదు. అసలు అమరావతి నుంచి పూర్తిగా రాజధానిని తరలిస్తామని ప్రభుత్వం ఎక్కడా ప్రకటించ లేదు..అసెంబ్లీ, ఇతర కార్యాలయాలన్నీ అమరావతిలోనే ఉంటాయని చెబుతోంది. కేవలం హైకోర్టు, సెక్రటేరియట్ మాత్రమే కర్నూలు, వైజాగ్‌లో ఏర్పాటు చేస్తాం అంటోంది. పైగా అమరావతిని ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దామని హామీ ఇస్తుంది. అయితే అన్నీ అమరావతిలోనే ఉండాలని…కర్నూలులో హైకోర్ట్ పెడితే రెండు జీరాక్స్ సెంటర్లు, నాలుగు టీ కొట్లు తప్పా…అక్కడ ఒరిగేదేం లేదంటూ అమరావతి ఆందోళనకారులు అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం మిక్కిలి బాధాకరం.
అమరావతి కోసం త్యాగం చేశామని కొందరు అంటున్నారు..అవును నిజమే.. రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ కింద మెట్ట ప్రాంతంలో ఒక ఎకరా (4840 గజాలు) భూమి ఇచ్చి, అభివృద్ధి చేసిన 500 గజాల నివాస స్థలం, 50 గజాల వాణిజ్య స్థలం, మరియు ఏటా 30 వేల చొప్పున పది సంవత్సరాలపాటు పరిహారం, ఇంటికో ఉద్యోగం, ఉచిత విద్య, వైద్య సౌకర్యం.. జరీబు భూములకైతే అభివృద్ధి చేసిన 500 గజాల నివాస స్థలం, 100 గజాల వాణిజ్య ప్లాట్లు మరియు ఏటా 50 వేలు చొప్పున పది ఏళ్లపాటు తీసుకొనే అమరావతి రైతులది త్యాగమా అందామా..అంటే దాదాపు కేవలం భూములు ఇచ్చారు అని రైతులకు ప్రతి ఏటా 2 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది..మరి భూములు ఫ్రీగా ఇచ్చింది ఎక్కడా..దీన్ని కూడా అమరావతి రైతుల త్యాగం అందామా..
త్యాగమంటే…కర్నూల్ లో 3 సంవత్సరాలు రాజధాని ఉన్నా కూడా ఉమ్మడి రాష్ట్రం కోసం వదులుకున్న రాయలసీమవాసులది…త్యాగమంటే…శ్రీశైలం కోసం 80 వేల ఎకరాలు ఇచ్చిన రాయలసీమవాసులది…ఈ శ్రీశైలం నీళ్లు నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజి ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాలకు వెళతాయి..అంతే కాని రాయలసీమకు పెద్దగా ఒరిగేందేమి లేదు..బ్యాక్‌వాటరే గతి…ఇప్పటికీ సీమవాసులు నికరజలాల కోసం కొట్లాడుతూనే ఉన్నారు. శ్రీశైలం నిర్వాసితులకు పెద్దగా పరిహారం ఇచ్చింది కూడా లేదు..ఇచ్చినా నామమాత్రమే.
త్యాగమంటే.. పోలవరం కోసం 60 వేల ఎకరాలను ఇచ్చిన గోదావరి జిల్లాల రైతులది, గిరిజనులది..ఉన్న ఊరిని కన్న భూమిని వదిలేసిన 1,66,000 కుటుంబాలది..పోలవరం నిర్వాసితులకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. అమాయక గిరిజనుల పేరుతో పరిహారం నొక్కేసిన ఘనులు..ఈ టీడీపీ నాయకులు. త్యాగమంటే..పులిచింతల ప్రాజెక్టు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన నల్లొండ జిల్లా రైతులది…పులిచింత ప్రాజెక్టును సరిగ్గా నల్లొండ జిల్లా సరిహద్దులో నిర్మించారు. దీని కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18 వేల ఎకరాల భూములు సేకరించారు. రిజర్వాయర్ బ్యాక్ వాటర్స్ లో 17 గ్రామాలు మునిగి పోయాయి. తరతరాలుగా అక్కడ నివసిస్తూ వచ్చిన ప్రజలు తలో దిక్కుకు చెదిరిపోయారు. పన్నెండేళ్ల క్రితం భూసేకరణ జరిపిన సమయంలో వారికి చెల్లించింది ఎకరానికి లక్షన్నరే. ఇప్పుడా ప్రాంతంలో ఎకరం భూమి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు పలుకుతోంది. పులిచింతల కింద భూములు కోల్పోయిన వారికి ఆ డ్యాంతో ఏ సంబంధం లేదు. పులిచింతల నీళ్లతో వాళ్ల పొలాలేమీ పండవు… కేవలం కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ కోసం నిర్మించారు. ఇప్పటికీ పులిచింతల నిర్వాసితులకు సరైన పునరావాసం కల్పించలేదు. అది నిజమైన త్యాగమంటే…
ఇక అమరావతిలో ఆందోళన చేస్తున్న వారిలో మెజారిటీ శాతం టీడీపీ అనుకుల రైతులే..ఇదే విషయాన్ని చంద్రబాబు తమ కులం కాబట్టే అమరావతిలో కమ్మ సామాజికవర్గానికి చెందిన రైతులు భూములిచ్చారు అని ఆగష్టు నెలలో తన చంద్ర జ్యోతి పత్రికలో రాధాకృష్ణ తన పచ్చ పలుకులో చెప్పుకొచ్చాడు.. అయితే ఒక వర్గానికి చెందిన రైతులే తప్పా.. భూములు ఇచ్చిన దళిత, బడుగు, బలహీనవర్గాల రైతులు తమ భూములు తమకు తిరిగి వస్తాయని ఆశపడుతున్నారు. అయినా మూడు పంటలు పండే సారవంతమైన భూములు ఇచ్చామని వాపోతున్న రైతులు… ప్రభుత్వం ఎవరి భూములు వారికి ఇస్తానంటే సంతోషంగా స్వాగతించేది పోయి…అమరావతిలోనే రాజధానిలోనే ఉండాలి…వైజాగ్, కర్నూలులో రాజధాని ఉండద్దు అంటూ వితండవాదం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. సో…ఇప్పుడు చెప్పండి… భవిష్యత్తు తరాల కోసం తమ జీవితాలను పణంగా పెట్టి శ్రీశైలం, పోలవరం, పులిచింతల ప్రాజెక్టులకు స్వచ్ఛందంగా భూములిచ్చిన రాయలసీమ, గోదావరి జిల్లా , నల్గొండ జిల్లా రైతులు, గిరిజనులది త్యాగం అందామా… కేవలం కులాభిమానంతో, స్వార్థం కోసం భూములిచ్చిన కొద్ది మంది అమరావతి ప్రాంత రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులది త్యాగం అందామా..? ప్రతి ఆంధ్రుడు నిస్వార్థంగా ఆలోచించండి..ఎవరిది త్యాగం..ఎవరిది అత్యాశ..!