2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి, ప్రజలకు ఆశ చూపెట్టి మొత్తానికి గెలిచారు. గెలిచిన తరువాత తనని నమ్మిని ప్రతీఒక్కరిని నట్టేట ముంచేశారు చంద్రబాబు. రైతులు విషయానికి వస్తే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అయిన చంద్రబాబు మాత్రం ఎలాంటి కనికరం చూపలేదు. ఇదేమి న్యాయం అని అడిగిన అందరిని పోలిసులతోనే కొట్టించేవారు. మరోపక్క భారీ కుంభకోణం అమరావతి విషయానికి వస్తే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ టీడీపీ నేతలు, చంద్రబాబు కులస్తులు రైతుల దగ్గర అక్రమంగా భూములు లాక్కున్నారు. దాంతో ప్రజలంతా చంద్రబాబుకి ఓటేసి మోసపోయాము అని భాదపడ్డారు. ఆ సమయంలోనే ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ ప్రజలకు అండగా ఉంటూ అధికారపార్టీ ఆగడాలను ఎదుర్కోనే ప్రయత్నాలు చేసారు. టీడీపీ ఎన్ని ఒత్తిడిలు, ఎలాంటి ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ప్రజల పక్షాన నిలిచారు. ఆ ధైర్యమే మొన్న ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచేలా చేసింది.
చంద్రబాబుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న ప్రజలు ఈ ఎన్నికల్లో జగన్ కే జై కొట్టారు. టీడీపీ దారునాతి దారుణంగా ఓడిపోయింది. ఓటమిని భరించలేని చంద్రబాబు జగన్ ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుండి ఏదోక రూపంలో చెడు చెయ్యాలనే చూస్తున్నారు. ఈ మేరకు చెయ్యాల్సిన ప్రయత్నాలు అన్ని చేసేసారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. లోకేష్, పవన్ రూపంలో పంపిన ఫలితం మాత్రం శూన్యంమే. చివరిగా ఇప్పుడు ఎవరివల్ల కావడం లేదని చంద్రబాబే భరిలోకి వచ్చి రాజధాని విషయంలో అడ్డు నిలుస్తున్నాడు. యావత్ రాష్ట్రం అటు టీడీపీ నాయకులు కూడా కొందరు జగన్ నిర్ణయాన్ని స్వాగతించడంతో చంద్రబాబు ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు. ఇప్పుడు కచ్చితంగా చంద్రబాబుకి ఒక విషయం అయితే బాగా అర్దమయి ఉంటుంది. ఆయన అరిస్తే బెదిరిపోవడానికి అక్కడ ఉండేది చినబాబు కాదు జగన్ అని.