హీరో నితిన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం భీష్మ. ఈ చిత్రానికి గాను వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. అయితే వీరిద్దరూ కలిసి హృతిక్ వార్ సినిమాలోని పాటకు చిన్న స్టెప్ వేసి అది హృతిక్ కి అంకితం ఇచ్చారు. ఆ వీడియోను చూసిన హృతిక్ నితిన్, రష్మికలకు థాంక్స్ చెప్పడమే కాకుండా. మీరు నటిస్తున్న బీష్మ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఆ వీడియో చూసి కామెంట్ ఇచ్చినందుకు రష్మికకు ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. దాంతో రష్మిక చాలా థాంక్స్ హృతిక్ సర్ ఎప్పటికైనా మీతో డాన్స్ స్టెప్ వేస్తాను అని కామెంట్ చేసారు.
