ప్రస్తుతం టాలీవుడ్ లో అరడజను మెగా హీరోలు చక్రం తిప్పుతున్నారు. వీరి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు కూడా బ్రేక్ చేస్తున్నాయి. అంతేకాకుండా వీరి ప్రభావం కూడా బాగానే చూపుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఏడాది మెగా హీరోలకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా వచ్చిన చిత్రం విన విదేయ రామ. ఈ ఏడాది ఈ సినిమా నిరాశే మిగిల్చినా ఆ తరువాత వరుణ్ తేజ్ ఎఫ్2 సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత పెద్ద దిక్కు చిరంజీవి సైరా సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్ తో హిస్టరీ సృష్టించింది. ఇంక సాయి ధరమ్ చిత్రలహరి చిత్రంతో వరుస ఫ్లాప్ ల తరువాత హిట్ సాధించాడు. మొన్న తాజాగా గద్దలకొండ గణేష్ చిత్రం తో నెగటివ్ రోల్ లో వరుణ్ తేజ్ నటనతో పిచ్చెక్కించాడు. ఇలా ఈ ఏడాది మొత్తం మెగా హీరోలకు బాగా కలిసొచ్చిందని చెప్పాలి.