ఏపీకి మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతిలో టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న వేళ..డిసెంబర్ 27 న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఇంకొన్ని గంటల్లో మూడు రాజధానులపై కేబినెట్ సమావేశం జరుగునుండగా టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌లో సీఎం జగన్‌పై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. నాని ట్వీట్స్ ఏంటంటే.. జగన్ అన్నా… ప్రజాగ్రహం ముందు నీలాంటి నియంతలు చాలా మంది కాలగర్భంలో కలిసి పోయారు. ప్రజా ఉద్యమాలను పోలీసులే కాదు ఎవరూ అణచలేరు.. అమరావతి నుంచి రాజదాని మార్చి నీ గోయి నువ్వు తవ్వుకోవద్దు. ప్రపంచం లో ఎక్కడా ఈ వింత పోకడ చూడలేదు ఎక్కడైనా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని కొరే/పోరాడే ప్రజాప్రతినిధులను చూసాం..కాని మన ప్రాంత దౌర్భాగ్యం ఏమిటో ఇక్కడి రాజధానిని విశాఖ తీసుకు పోతున్నామంటే పదవుల కోసం జీ హుజూర్ నీ కాళ్ళు మొక్కుతా అనే ప్రజాప్రతినిధులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వుండటం మన కర్మ అంటూ నాని ఫైర్ అయ్యారు. ఇంకో ట్వీట్ చేస్తూ..అమరావతి నుంచి రాజధాని మారుస్తున్న మన జగన్ అన్న.. పిచ్చి తుగ్లక్ కంటే 20 రెట్లు పిచ్చోడు అని సీనియర్ పాత్రికేయుడు శేఖర్ గుప్త తేల్చి చెప్పారంటూ కేశినేని నాని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అయితే నాని ట్వీట్లపై వైసీపీ నేత పీవీపీ ట్విట్టర్ వేదికగానే అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. రోజమ్మ మొదలుకుని ఎందరో నాయకులని అణిచివేద్దామని, మీ చంద్రన్న చేయని ప్రయత్నం లేదు బెదరు. ఆ సలహా ఏదో మీ బాస్ కి బాగా వర్తింస్తుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాభీష్టం మేరకు వారి రాజధాని ఉంటుంది. నువ్వు నేను అన్ని మూసుకొని ఆంధ్రులందరి మాట విందాం అంటూ పీవీపీ నాని ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. మొత్తంగా మూడు రాజధానుల అంశంలో సీఎం జగన్‌పై రెచ్చిపోయిన పరుష వ్యాఖ‌్యలు చేసిన టీడీపీ కేశినేని నానికి, వైసీపీ నేత పీపీవీ కూల్‌గా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ట్విట్టర్ వార్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.