రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్‌కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. దాంతో ఫైర్ అయిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ పై ధ్వజమెత్తారు. “ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగక పోతే టీడీపీ నాయకులు, చంద్రబాబువర్గం రియల్ ఎస్టేట్ వ్యాపారులు 4 వేల ఎకరాల భూమిని కూడబలుక్కున్నట్టు ఎలా కొంటారు? 2014 జూన్ లో బాబు సిఎం అయ్యారు. డిసెంబర్ లో అమరావతిని క్యాపిటల్ గా ప్రకటించే లోపే ఐదు నెలల్లో ఎగబడి కొన్నారంటే తెలియడం లేదా? ” అని ప్రశ్నించారు.