నలబైఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా తయారయ్యిందని చెప్పాలి. మొన్నటివరకు నాగులు మూలలు నలుగురు ఉండేవారు ఇప్పుడు ఒంటరి అయిపోయారు. అయినప్పటికీ ఆయనలో మార్పు మాత్రం రాలేదు. ఎందుకింత రాజకీయ పిచ్చో అర్ధంకాని పరిస్థితి. అప్పట్లో తెలంగాణ రాష్ట్రం నినాదం విషయంలోనూ చంద్రబాబు ఇలానే చేస్తే వారు ఛీ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉత్తరాంధ్ర విషయంలో కూడా అదే జరగనుంది. రాజధాని విషయంలో ఒక్క చంద్రబాబు తప్పా మొత్తం అందరు బాగానే ఉన్నారు. ఈయన వైజాగ్ లో రాజకీయాన్ని కలుషితం చేయడానికి సొంతం పార్టీ ప్రయోజనాల్ని పణంగా పెట్టారు. దీనికి ప్రతిఫలమే అవంతి శ్రీనివాస్ టీడీపీ ని వదిలేయడం. ఇది పక్కన పెడితే ప్రస్తుతం టీడీపీ చెప్పుకోవడానికి గంటా ఒక్కరే అక్కడ కనిపిస్తున్నారు. కాని ఆయన కూడా జగన్ నిర్ణయాని స్వాగతిస్తున్నట్టు ఇదివరకే చెప్పుకొచ్చారు. ఏకా గంటా కూడా ఏ క్షణమైనా పార్టీని వీడే ఛాన్స్ అయితే కచ్చితంగా ఉంది. ఇక చంద్రబాబు చెప్పుకోడానికి అయితే అక్కడ ఏమీ లేనప్పటికీ ఎప్పటికీ వైజాగ్ లో రాజధాని వద్దనే అంటున్నాడు. ఇలా చంద్రబాబు తన రాజకీయ పిచ్చితో ఏం చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో ఆయనకే అర్ధం కావడం లేదని తెలుస్తుంది. ఒక తప్పు చేస్తే సరిదిద్దికోవచ్చు కాని తెలిసి తెలిసి ప్రతీసారి తప్పు చేస్తే దాన్ని మూర్ఖత్వం కాక ఇంకేం అనాలి..?