ఇసుక అక్రమాలను నివారించడానికి ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని మొదలుపెట్టింది.. అయితే కొందరు దాన్ని కూడా అక్రమ దందాగా మార్చేసారు. ఐటీ తెలివితేటలతో కొందరు తత్కాల్ టికెట్లను బ్లాక్ చేసినట్లు ఇసుకను కూడా బ్లాక్ చేస్తున్నారు. దాంతో సామాన్యులకు ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇలా చేయడం వల్ల ఒక్కో బుకింగ్ కు రూ.2 వేలు కమీషన్‌గా ఇస్తున్నారు వ్యాపారులు. నిమిషాల్లోనే వేలకు వేలు డబ్బులు రావడంతో బుకింగ్ లు చేసే సంఖ్య కూడా పెరిగిపోయింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఇంజినీరింగ్ విద్యార్థులతో పాటు చిన్న చిన్న వ్యాపారులు సైతం దీనిపైనే ఉన్నారని తెలుస్తుంది. గ్రూపులు కింద ఉంటూ టవర్స్ కింద కూర్చుకొని ఇవి ఆపరేట్ చేస్తున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో ఒక్క చౌటుప్పల్ దగ్గరలోనే 2000లకు పైగా ఉన్నారట. మరి మిగతా చోటు ఇంక ఎంతమంది ఉంటారో చెప్పాలిసిన అవసరం కూడా లేదనే చెప్పాలి. వీరంతా బుకింగ్ చేసి అక్రమ వ్యాపారులకు సహకరించడంతో..అసలైన వారికి ఇసుక అందకుండా పోతుంది.
