ఎవరికైనా సరే సినిమాల్లో స్టార్‌డమ్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. కొందరికైతే వెంటనే వచ్చేస్తుంది. మరికొందరికైతే ఎన్ని సినిమాలు చేసినా ప్రయోజనమే ఉండదు. ఇందులో ముందువరుసలో ఉన్నవారు ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చేది శ్రద్దా దాస్. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ అంతగా రాణించలేకపోయింది. ఎక్స్ పోజింగ్ చేసి ఎన్ని అందాలు ఆరబొయ్యలో అన్ని చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. మరోపక్క ఐదు బాషల్లో దాదాపు 38 సినిమాలు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కలగలేదు. దాంతో ఇక ఇలా కాదని అనుకున్న శ్రద్దా వెకేషన్ నిమిత్తం ఎంజాయ్ చేయడానికి బాలీ దీవులకు వెళ్ళింది. అక్కడ బికినీలో ఎంజాయ్ చేస్తూ బికినీ లైఫే బెటర్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది.