మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా..
అయితే ఈ ఏడాది జూలై నెలలో చోటు చేసుకున్న అంతర్జాతీయ విశేషాలు ఏంటో తెలుసుకుందామా..?
* ప్రపంచ వ్యాప్తంగా వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో అమెరికాకు అగ్రస్థానం
* కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని మరియం త్రేసియాకు పునీత(సెయింట్)హోదాను ప్రకటించిన పోప్ ఫ్రాన్సిస్
* భూతాపం వలన వచ్చే పదేళ్లలో ఎనిమిది కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని అంతర్జాతీయ కార్మిక సంస్థ హెచ్చరించింది
* ఇండియా ఐటీ నిపుణులకు లాభం చేకూర్చే గ్రీన్ కార్డు బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది
* బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా బోరిస్ జాన్సన్ నియామకం
* ఫేస్ బుక్ కు రూ.35వేల కోట్ల జరిమానా విధించిన ఫెడరల్ ట్రేడ్ యూనియన్
* నేవీ మాజీ అధికారి జాదవ్ కు పాక్ వేసిన ఉరిశిక్షను నిలిపివేసిన అంతర్జాతీయ న్యాయ స్థానం
* సింగపూర్ అంతర్జాతీయ కమర్షియల్ కోర్టు న్యాయమూర్తిగా నియామకమైన ఎస్సీ మాజీ న్యాయమూర్తి అర్జన్ కుమార్ సిక్రీ
* 2006-16మధ్య భారత దేశంలో 27.1కోట్ల మంది పేదరికం నుండి గట్టెక్కారని UNO ప్రకటించింది