కొద్దిరోజులుగా గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయి. దీనంతటికి కారణం వాతావరణం, తూఫాన్ కాదు. కేవలం మిడతల వల్లే ఇంత నష్టం వాటిల్లింది. అయితే ఇక ఈ మిడతలు ఎక్కడనుండి వచ్చాయి అనేది చూసుకుంటే అవి పాకిస్తాన్ నుండి భారత్ లోకి చొరపడ్డాయి. దాంతో అక్కడి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అరికట్టడానికి కుదరకపోవడంతో రంగంలోకి దిగిన కేంద్రం 9ప్రత్యేక బృందాలను పంపించింది. వారు వాటిని అరికట్టడానికి డ్రోన్ల సహాయంతో క్రియసంహారక మందులను జల్లుతున్నారు. మరోపక్క పొలాల్లో ఫాన్లు, లౌడ్ స్పీకర్స్ ఇలా చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఆఫ్రికా నుండి బయలుదేరి అరబ్ దేశాల మీదుగా పాకిస్తాన్ వచ్చాయి. అక్కడ సింద్ ప్రాంతం ఎడారి గుండా భారత్ లోకి చొరబడ్డాయి. మరో నాలుగైదు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.