న్యూఇయర్ వచ్చేస్తుంది..ఇక కుర్రాలు హుసారెక్కిపోతారు. బాగ్యనగరంలో ఇప్పటికే ఫుల్ జోష్ కనిపిస్తుంది. ఏడాది చివర్లో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో ఇంకా చెప్పాలంటే ప్రేమజంటలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆరోజు మొత్తం వారికే సొంతం. కాని ఈసారి మాత్రం అలాంటివేమి ఉండవనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. పోలీసులు భారీగా ప్లానింగ్ వేసారు. ఎక్కడికక్కడ నిఘా పెట్టడమే వాళ్ళ పని అని చెప్పాలి. ఈసారి రోడ్లపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. మరో ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. రోడ్లపై గాని గల్లిలో గాని గుంపులుగా కనిపిస్తే మాత్రం చర్యలు తీసుకోనున్నారు. ఇవన్నీ పక్కన పెడితే యూత్ జీర్ణించుకోలేని విషయం ఒకటి ఉంది. అదేమిటంటే న్యూఇయర్ వచ్చిందంటే నగరంలో పబ్ లు యూత్ తో కిక్కిరిసిపోతాయి. ఈసారి మాత్రం అలా జరిగేలా లేదు ఎందుకంటే ఈసారి పబ్ లకు పెళ్ళైన దంపతులకు మాత్రమే ఎంట్రీ ఉండేలా పోలీసులు న్యూ రూల్ తో దెబ్బకు అందరికి ఏదోలా అయిపొయింది.
