ఒకప్పుడు ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. అప్పటికీ, ఇప్పటికీ స్వర్గీయ నందమూరి తారకరామారావు మీది ఎనలేని అభిమానం అక్కడి ప్రజల్లో కనిపిస్తుంది. కాని చంద్రబాబు దయవల్ల ఆ అభిమానం తగ్గుమొకం పడుతూ వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక టీడీపీ ఉనికి అక్కడ లేనట్టే అని చెప్పాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ముఖ్య నగరం ఏదీ అంటే వెంటనే గుర్తొచ్చేది విశాఖపట్నం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దానినే రాజధానిగా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల ప్రతీఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ వ్యతిరేకస్తులు కూడా ఇప్పుడు జగన్ నే సపోర్ట్ చేస్తున్నారు. దాంతో ఇక టీడీపీ ఇక దుకాణం సర్దుకోవలసిందే అని అర్ధమవుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏపీ కి సంబంధించిన 13జిల్లాలలో వైజాగ్ ఒక్కటే రాజధాని నగరంగా కనిపించింది. హైదరాబాద్ తరువాత అంత పెద్ద నగరం వైజాగ్ నే కాని చంద్రబాబు దానికి ఆ అదృష్టాని కల్పించలేదు. రాజధానిని తీసుకెళ్ళి అమరావతిలో పెట్టడం జరిగింది. హుద్‌హుద్ తుపాను వైజాగ్ నగరానికి భారీ నష్టం తెచ్చినప్పటికి దానికన్నా చంద్రబాబు ఆ పేరు చెప్పుకొని సృష్టించిన నష్టమే ఎక్కువ ఉందని చెప్పడంలో సందేహమే లేదు. ఇలా ప్రతీ విషయంలో చంద్రబాబు నగరాన్ని కిందకు తొక్కేయాలని చూస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మాజీ మంత్రి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైతం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన విషయం తెలిసిందే.