కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసలు కురిపించారు. ప్రాజెక్టులో జరిగిన ఇంజినీరింగ్ కృషి అద్భుతమన్నారు. పర్యావరణాన్ని పాడుచేయకుండా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో 34 వ ఇండియన్ ఇంజనీర్స్ కాంగ్రెస్ కు గవర్నర్ తమిళిసైతో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సహజ వనరులు కాపాడుకుంటూ రాబోయే భావి తరాలకు.. చక్కని ఎకో సిస్టమ్ అందివ్వాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు గవర్నర్.
