కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలువాలని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికలపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం కార్యక్రమానికి వినోద్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. టికెట్లు అందరికి ఇవ్వడం సాధ్యం కాదు.. కొన్ని చోట్ల వ్యక్తుల పలుకుబడి, సామాజిక పరమైన అంశాలు ఉంటాయి. టికెట్ వచ్చిన వారు గొప్ప వారు…రాని వారు భాదపడాల్సిన అవసరం లేదు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఓడిపోయినప్పుడు భాదపడలేదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు ఎమ్మెల్యులు, ఎంపీలు,మంత్రులం అవుతుమని అనుకోలేదని అన్నారు.
కేసీఆర్ ను ప్రజలు ఆదరించి సీఎంని చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాన దేశంలోనే ముందు వరుసలో ఉంది. ఆర్ధికంగా చాలా రాష్ట్రాలు కుప్పకూలిపోయినా..తెలంగాణ మాత్రం ధృడంగా ఉందన్నారు.
కరీంనగర్ లో బీజేపీ ఎంపీ గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ కోసం బీజేపీకి ఓటు వేశారు. స్ధానిక సంస్ధల ఎన్నికలకు మోదీ అవసరం లేదు. కరీంనగర్ కు బీజేపీ చేసిందేమి లేదన్నారు. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని అన్నారు.