నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాది అస్సలు కలిసిరావడంలేదని చెప్పాలి. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తన సొంత నిర్మాణంలో ఎన్టీఆర్ కధానాయకుడు, మహానాయకుడు విడుదలయ్యాయి. కాని సినిమా పరంగా ఫ్లాప్ అయ్యాయి. డబ్బులు పోయిన పర్లేదుగాని, సినిమా పోవడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మరోపక్క జై సింహా కూడా అదే పరిస్థితి. అయితే ఈ ఏడాది పెరి చెప్పి కనీసం ఇప్పుడైనా రూలర్ రూపంలో సినిమా హిట్ అవుతుందా అని అనుకుంటే ఇది వాటికన్నా దారుణం అని చెప్పాలి. కలెక్షన్స్ గురించి చెప్పుకుంటే పరువుకూడా పోతుందని చెప్పాలి. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుత బాలయ్య సినిమా పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ పోస్టర్ లో బాలయ్య ఒక స్టెప్ లో ఉంటాడు. దానికి ఒక చీపురుకర్రను అతికించారు. అది సరిగ్గా సెట్ అవ్వడంతో ఇదొక కొత్త స్టెప్ ఏమో అని ట్రోల్ చేస్తున్నారు.
