Home / ANDHRAPRADESH / ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. బాబు బ్యాచ్‌లో ఆందోళన..!

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. బాబు బ్యాచ్‌లో ఆందోళన..!

ఏపీకి మూడు రాజధానులపై జీఎన్ రావు కమిటీ నివేదికపై డిసెంబర్ 27న భేటీ అయిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది రాజధానిపై జీఎన్‌రావు కమిటీ నివేదికతో పాటు, శివరామకృష్ణ కమిటీ నివేదికను కూడా మంత్రి మండలి అధ్యయనం చేసింది. కాగా రాజధానిపై నియమించిన బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. బీసీజీ రిపోర్టు అనంతరం వాటిపై హైపవర్‌ కమిటీ సమీక్షించిన తరువాత ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రిమండలి తెలిపింది. ఇక అమరావతి ఆందోళనలు చేస్తున్న రైతులకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రాజధాని భూములపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేబినెట్ స్పష్టం చేసింది. అయితే మూడు రాజధానుల వ్యవహారం కంటే ముందుగా అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవాళ భేటీలో భాగంగా రాజధాని ప్రకటనకు ముందు జరిగిన భూకొనుగోళ్లపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలోని సబ్ కమిటీ.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఓ నివేదికను సమర్పించింది.

అమరావతిలో దాదాపు 4వేల 75  ఎకరాలకు పైగా ఇన్‌సైడింగ్ ట్రేడింగ్ జరిగిందని సబ్ కమిటీ నిర్థారించినట్లు సమాచారం. అమరావతి రాజధానిగా వస్తుందని ముందే తెలుసుకుని అమరావతి గ్రామాల్లో ఎవరెవరు భూములు కొన్నారో వారి పూర్తి వివరాలను సబ్‌కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ నివేదికలో పలువురు టీడీపీ నేతల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా చంద్రబాబు, లోకేష్‌కు చెందిన హెరిటేజ్ సంస్థతో సహా, నారాయణ, రావెల కిషోర్ బాబు, పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు వంటి మాజీమంత్రులు, మాజీ కేంద్రమంత్రి, బాబుగారికి అత్యంత సన్నిహితుడైన సుజనాచౌదరి, ధూళిపాళ నరేంద్ర, బాలయ్య, జీవియస్ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్, వంటి మాజీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు, వేమూరు రవికుమార్ చౌదరి, లింగమనేని రమేష్ చౌదరి వంటి బాబు, లోకేష్‌ల బినామీలు..ఇలా టీడీపీ నేతలంతా.. బినామీల పేరుతో 4వేల ఎకరాలకు పైగా ల్యాండ్ స్కామ్‌కు పాల్పడినట్లు సబ్ కమిటీ నిర్ధారించినట్లు తెలుస్తోంది. అలాగే 900 ఎకరాల అసైన్డ్  భూములను ఎస్సీ, ఎస్టీల నుంచి టీడీపీ నేతలు బలవంతంగా కొనుగోలు చేసినట్టు కూడా కమిటీ నివేదికలో తెలిపింది. హైద్రాబాద్‌లో తెల్ల రేషన్‌ కార్డు దారులు కూడా అమరావతిలో కోట్లాది రూపాయల భూములు కొన్నట్టు, టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ తో భూములు కొన్నట్టు కమిటీ నిర్ధారణకు వచ్చిందని తెలుస్తోంది. అలాగే గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై కూడా మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సీఎం వైఎస్ జగన్‌కు అందజేసింది. దాదాపు 4 నెలల పాటు వేర్వేరు సందర్భాల్లో సమావేశమై రాజధాని సహా అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసింది. రాజధాని ప్రాంతంలోని నిర్మాణాలు, ల్యాండ్ పూలింగ్, రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు పైనా ఈ కమిటీ అధ్యయనం చేసింది. కేబినెట్ సమావేశంలో ఉప సంఘం నివేదిక అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా అమరావతిలో టీడీపీ హయాంలో జరిగిన బినామీ భూబాగోతంపై సీబీఐ విచారణకు జరిపించాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో బాబు బ్యాచ్‌లో మరింత ఆందోళన మొదలైంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat