తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రానున్న సంక్రాంతి పండుగ పూట నెలకొనున్న రద్ధీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులను నడపాలనే నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,940ప్రత్యేక బస్సులను నడిపించాలని ఆర్టీసీ సిద్ధమవుతుంది.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నుండి అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోని పలు రూట్లల్లో ఈ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.
జనవరి పదో తారీఖు నుండి జనవరి పదమూడో తారీఖు వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు…