బాలీవుడ్లో వారసుల పిల్లలు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అవలీలగా విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో హీరోల కొడుకులు మాత్రమే ఇండస్ట్రీలోకి వస్తుంటారు. వారసుల కూతుర్లు హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ, బాలీవుడ్ లో మాత్రం అలా కాదు. టాప్ హీరోల కూతుర్లు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంటారు. ఇలా వచ్చిన వాళ్లలో సోనమ్ కపూర్, సోనాక్షి సిన్హా ఇలా ఎందరో ఉన్నారు.
వీరంతా సక్సెస్ సాధించిన నటీమణులే. త్వరలోనే షారుక్ ఖాన్ కూతురు కూడా హాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నది. అటు మరో టాప్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతున్నది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందే సారా అలీఖాన్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ, బికినీ డ్రెస్ లలో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నది. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా సారా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ డ్రెస్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం బాలీవుడ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.