ఇండియాలో ఏ క్రీడలో అయినా సరే ముందు జట్టులో స్థానంకోసం పోరాటం, ఆ తరువాత పేరు సంపాదించడం తరువాత వీడ్కోలు చెప్పడం. అనంతరం రాజకీయాల్లోకి వెళ్ళడం. ఇది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అయితే ఈ ఏడాది చాలామంది క్రీడలు నుండి రాజకీయాల్లోకి వెళ్ళినవారు వారు. వారి వివరాల్లోకి వెళ్తే..!
గౌతమ్ గంభీర్:
గౌతమ్ గంభీర్.. క్రికెట్ లో ఐనా బయట ఐనా ఒకే మనస్తత్వం ఉన్న వ్యక్తి. 2007 టీ20, 2011 ప్రపంచకప్ లో కీలక పాత్ర పోషించిన గంభీర్ క్రికెట్ కు దూరం అయ్యాక రాజకీయాల్లో అడుగుపెట్టాడు. తూర్పు ఢిల్లీ నుండి బీజేపీ తరపున పోటీ చేసి ఘనవిజయం సాధించాడు.
సందీప్:
సారధిగా భారత హాకీ జట్టుకు ఎన్నో సేవలు అందించిన ఆటగాడు సందీప్. అంతేకాకుండా హర్యానాలో బీజేపీ తరుపున పోటీ చేసిన ఆటగాళ్ళలో గెలిచిన ఏకైక ఆటగాడు సందీప్.
యోగేశ్వర్ దత్:
లండన్ ఒలింపిక్స్ లో కుస్తీ పోటీలో కాంస్యం సాధించిన ఆటగాడు యోగేశ్వర్ దత్. ఈయన హర్యానా నుండి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
విజేందర్:
ఈ ఏడాదిలో ఆటగాళ్ళు అందరు బీజేపీలో చేరితే విజేందర్ మాత్రం కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తరపున దక్షిణ ఢిల్లీ నుండి పోటీ చేసి ఓటమి చవిచూశారు.
బబితా కుమారి:
భారత రెజ్లింగ్ కే వన్నె తెచ్చిన వ్యక్తి బబితా కుమారి. ఈమె హర్యానా నుండి బీజేపీ తరుపున పోటీ చేసి సంచలనం సృష్టించింది. కాని ఓట్ల పరంగా ఆమె కరుణించలేదు.