టీమిండియా మాజీ కెప్టెన్ ,క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు ముంబై పోలీసులు షాకిచ్చారు.ప్రస్తుతణ్ సచిన్ కు ఉన్న భద్రతను తొలగిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.
సచిన్ కి ఇప్పటివరకు ఇరవై నాలుగంటలు పాటు X కేటగిరి సెక్యూరిటీ ఉండేది..అయితే సచిన్ టెండూల్కర్ భద్రతపై సమీక్షించిన పోలీసులు సచిన్ కున్న భద్రతను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు శివసేన ఎమ్మెల్యే,సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడైన ఆధిత్య ఠాక్రేకు Y+ నుండి Z కేటగిరి భద్రతకు పెంచారు.ప్రస్తుతం ఆధిత్య ఠాక్రేకు పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు