ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం నెలకొల్పేదిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మక పథకాలు అమలు చేస్తూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే, ఐతే ఈ విషయాన్ని అఖిల భారత బీసీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రస్ధావించడం జరిగింది. బీసీనేతలు రాష్ట్రాలను ఏలినప్పటికీ తగిన స్ధాయిలో బీసీ లకు న్యాయం జరగలేదని, ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని అన్నారు. మంత్రివర్గంలో బీసీలకు 60 శాతం, నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు పీజీ వరకూ నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తోందని తెలిపారు.
మిగతా అన్ని రాష్ట్రాలూ వీటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సలహాయిచ్చారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలంటే బీసీలు చట్టసభల్లోకి రావాలని. కేంద్ర సచివాలయంలో ఓబీసీ వర్గానికి చెందిన ఒక్క కార్యదర్శి కూడా లేరు. కేంద్ర కేబినెట్‌లో ఒక్క ఓబీసీ కూడా మంత్రిగా లేరు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉండాలి కానీ 15 శాతం కూడా అమలు కావడంలేదని. క్రీమీలేయర్, నాన్ క్రీమీలేయర్ అంటూ అన్యాయం చేస్తున్నారని అని జస్టిస్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్య అందిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన తెల్పారు.