జాన్వీ కపూర్ అలనాటి అందాల తార దివంగత సీనియర్ నటి శ్రీదేవి కపూర్ తనయగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తన అందంతో.. నటనతో ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో విజయ్ దేవరకొండపై మనస్సు పారేసుకుంది ఈ ముద్దుగుమ్మ.ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ” విజయ్ దేవరకొండ తన ఆల్ టైమ్ క్రష్ .
అతడ్ని చూస్తే ముచ్చటగా అన్పిస్తుంది. తనకు తెల్సి ఇది వన్ సైడ్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. అయితే తన అభిప్రాయాలు కాలానుగుణంగా మారుతుంటాయని జాన్వీ తెలిపింది. అయితే విజయ్ చాలా స్థిరంగా ఉంటాడు. విజయ్ పై తన అభిమానం స్థిరంగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది.