క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు, వింతలు జరిగాయి. బ్యాట్టింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్ ఇలా ప్రతీ కోణంలో ఎవరికవారే టాప్ అని చెప్పాలి. ఇక వికెట్ కీపింగ్ విషయానికి వస్తే అన్ని విభాగాల్లో ఎక్కువ కష్టమైనది కీపింగ్ అనే చెప్పాలి. అయితే కీపింగ్ ఒక్కటే అయితే పర్వాలేదు దానికి తోడు కెప్టెన్ గా కూడా ఉంటే అంతకన్నా కష్టమైన పని ఇంకొకటి ఉండదు. ఇప్పటికే అర్దమయి ఉంటుంది అది ఎవరూ అనేది. అదే మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని. అతడు క్రికెట్ లో అడుగు పెట్టడం భారత్ కు నిజంగా అదృష్టమనే చెప్పాలి. అతడు ఆడిన ఆట, సారధిగా జట్టుని ముందుండి నడిపించి ఎన్నో విజయాలు తెచ్చిపెట్టాడు. ఇక అసలు విషయం కీపింగ్ విషయానికి వస్తే ఈ దశాబ్దకాలంలో అతడిని మించిన వారు లేరు. మొత్తం 196 మ్యాచ్ లలో 242 డిస్మిస్సల్స్ చేసాడు.
