మరో ఐదురోజుల్లో 2019 సంవత్సరం ముగియనుంది. అయితే ఈ ఏడాది మొత్తం లో క్రికెట్ గురించి చూసుకుంటే ఎన్నో వింతలు, అద్భుతాలు జరిగాయి. క్రికెట్ పుట్టినిల్లు ఈ ఏడాది ప్రపంచకప్ గెలుచుకుంది. మరోపక్క ఎంతోమంది యువ ఆటగాలు వెలుగులోకి వచ్చారు. ఇలా ఎన్నో అద్భుతాలు జరిగాయి. అయితే ఇక భారత్ మాజీ ఓపెనర్ గంభీర్ విషయానికి వస్తే ఈ ఏడాది గంభీర్ బెస్ట్ 11ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసాడు. అందరికి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతని జట్టులో ధోని లేదు అయితే ఇక మిగిలేది కోహ్లి నే కదా అనుకుంటారు. కాని కోహ్లి ఉన్నప్పటికే అతడు కెప్టెన్ కాదు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియంసన్ ను సారధిగా పెట్టారు. అయితే ఇంకో కొత్త విషయం ఏమిటంటే ఇందులో అరవింద్ వశిష్ట్, వేయు రాఘవన్ ను తీసుకున్నాడు. ఇక జట్టు వివరాల్లోకి వెళ్తే..!
రోహిత్ శర్మ, టామ్ లాథమ్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్(C), అరవింద్ వశిష్ట్, బెన్ స్టోక్స్, కమ్మిన్స్, బుమ్రా, వేయు రాఘవన్. లైయన్.