టాలీవుడ్ లో తాను నటించిన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని అతితక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్. ఆ తరువాత వచ్చిన నువ్వు నేను, మనసంత నువ్వే చిత్రాలు సూపర్ డుపర్ హిట్ అయ్యాయి. ఎలాంటి సినీ పరిచయం లేని కుటుంబం నుండి వచ్చి ఇంత పేరు తెచ్చుకోవడం అంటే మామోలు విషయం కాదనే చెప్పాలి. దాంతో నిర్మాతలు, దర్శకులు క్యు కట్టడం మొదలుపెట్టారు. ఇలా మంచి ఊపు మీద ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి అతడిని అల్లుడిని చేసుకోవాలి అనుకున్నారు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల నిశ్చితార్ధం ఆగిపోయింది. అంతే ఇంక అప్పటినుండి ఉదయ్ కిరణ్ నటించిన ఏ సినిమా హిట్ కాలేదు కొన్ని సినిమాలు అయితే మధ్యలోనే ఆగిపోయాయి. దాంతో ఈ హీరోకి చేదుఅనుభవం కలగడానికి చిరంజీవే కారణమని వార్తలు వచ్చాయి.
ఇక అదంతా పక్కన పెడితే ఆ సమయంలో ఉదయ్ కిరణ్ ఒకరిని పెళ్లిచేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాలేకు అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఈ ఆత్మహత్యకు చిరంజీవికి లింక్ ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఉదయ్ సోదరి శ్రీదేవి అప్పుడే చిరంజీవికి దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ ఆ వార్తలు మాత్రం ఆగలేదు. ఇక అసలు విషయానికి వస్తే ఉదయ్ కిరణ్ తో వియ్యాల వారి కయ్యాలు సినిమా తీసిన దర్శకుడు లగడపాటి శ్రీధర్ ఈ సినిమా విడుదల సమయంలో చిరంజీవిని ఈ గాసిప్ గురించి అడగగా సినిమా హిట్ అవ్వాలని అల్ ది బెస్ట్ కూడా చెప్పారని ఆయన అన్నారు. ఉదయ్ కిరణ్ మరణంలో చిరంజీవికి ఎటువంటి సంబంధించి లేదని చెప్పారు.