తాజాగా రాష్ట్రంలో రాజధానిని మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో చంద్రబాబు రాజధాని కేవలం అమరావతిలోని ఏర్పాటు చేయాలని ప్రజలలోకి వెళ్లడం మంచిది కాదని ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. విశాఖకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇతర టీడీపీ నాయకులు, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఏర్పాటు చేసే నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామంటూ తీర్మానం చేసుకున్నారు. వీరిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసు ప్రముఖ పాత్ర పోషించారు. ఇక విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైనా బాలకృష్ణ చిన్న అల్లుడు సైతం దీనిని స్వాగతించారు.
వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న జగన నిర్ణయం ప్రజలతో సహా టీడీపీలో కొందరు నాయకులు సైతం సమర్ధిస్తున్నారు. కేవలం చంద్రబాబు అతని తనయుడు లోకేష్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార వికేంద్రీకరణకు చంద్రబాబును ఒప్పించేందుకు కొందరు ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు ప్రయత్నిస్తున్నారని ఒకవేళ చంద్రబాబు ఒప్పుకోక పోయినట్లయితే పార్టీని వీడవలసి వస్తుందని సూచనప్రాయంగా చెప్పినట్లు తెలుస్తుంది. ఇక చంద్రబాబు రాజధాని విషయంలో కూడా గతంలో మాదిరి యూటర్న్ బాట పడతారా అన్నది వేచిచూడాల్సిఉంది.