వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే చోటు చేసుకున్న దారుణం. దాదాపు ముప్పై వేల మంది మహిళలు బతకడానికి బతుకుదెరువు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన మహరాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ విషయం గురించి కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎస్సీ విభాగం చైర్మన్ అయిన నితిన్ రౌత్ ఒక లేఖలో పేర్కొన్నారు. మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఒక లేఖ రాస్తూ” కూటికోసం కోటి తిప్పలు అన్నట్లు.. రాష్ట్ర వ్యాప్తంగా చెరుకు తోటల్లో పని చేస్తున్న ముప్పై వేల మంది పేద మహిళలు గర్భాశయ ఆపరేషన్ చేయించుకున్నారు. వ్యవసాయ భూమి లేని పేద మహిళలు తమ జీవనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. రుతు సమయంలో పేద మహిళలు కూలీ పనికి వెళ్లలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి మహిళలను ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కోరారు.
