ఐపీఎల్ 2020 ఆక్షన్ విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మిగిలిందల్లా ఈ మెగా ఈవెంట్ యొక్క షెడ్యూల్ మాత్రమే. ఈ మేరకు ప్రతీఒక్కరు ఎదురుచూస్తున్నారు. మార్చి 28 నుంచి మే 24 వరకు షెడ్యూల్ చేయాలని బిసిసిఐ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదంతా బాగానే ఉందిగాని అసలు సమస్య ఇక్కడే ప్రారంభం అయ్యింది. అదేమిటంటే బీసీసీఐ అనుకుంటున్న తేదీలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మరియు శ్రీలంక జట్లకు ఆ సమయంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఉండే అవకాసం ఉంది. అదేగాని జరిగితే కోట్లు కుమ్మరించిన ఆటగాళ్ళు పాట్ కమ్మిన్స్, మాక్స్వెల్, స్మిత్, వార్నర్, బట్లర్, విలియంసన్ ఇలా అందరు దూరం కాక తప్పదు. అదేగాని జరిగితే కష్టమే అని చెప్పాలి.
