శ్రీరాంసాగర్ జలాశయం నుండి యాసంగి పంటల సాగుకు ఈ రోజు బుధవారం కాకతీయ,లక్ష్మీ,సరస్వతి కాలువల ద్వారా నీటిని అధికారులు విడుదల చేయనున్నారు.
లోయర్ మానేరు ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు అందజేయనున్నారు. సరస్వతి కాలువ కింద మరో ముప్పై ఐదు వేల ఎకరాలకు ,లక్ష్మీ ఎత్తిపోతల పథకం కింద మరో ముప్పై మూడు వేల ఎకరాలకు నీరు విడుదల కానుండటంతో రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని వారబందీ పద్ధతిలో ఏప్రిల్ పదో తారీఖు వరకు సరఫరా చేయనున్నారు.