నారావారి పుత్రరత్నం…లోకేష్ మళ్లీ పప్పులో కాలేశాడు..సారీ ట్వీటేశాడు..చినబాబుకు తెలుగే కాదు..ఇంగ్లీష్ కూడా సరిగా రాదని తనకు తానే బయటపెట్టుకున్నాడు. తాజాగా కడపలో పర్యటించిన సీఎం జగన్..ఎన్ఆర్సీకి తమ ప్రభుత్వం వ్యతిరేకమని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో అమలు చేయమని ప్రకటించాడు. ఇంకే ముందు జగన్ దొరికిపోయాడు అని లోకేష్ మురిసిపోయాడు. ఆఘ మేఘాల మీద ట్విట్టర్‌లో కూతెట్టాడు. ఇంతకీ లోకేష్ ట్వీట్ ఏంటంటే.. వైకాపా నాయకులు వారి అధ్యక్షుడు @ysjaganగారే పెయిడ్ ఆర్టిస్ట్ అని గుర్తించడం మంచిది. పార్లమెంట్లో మద్దతు ఇస్తారు. అసెంబ్లీలో నోటిఫికేషన్లు ఇస్తారు. బయటమాత్రం మేము వ్యతిరేకం అని ప్రచారంచేస్తారు. 16 ఆగష్టు 2019న NRC పై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు కడప సభలో NRC అమలు చెయ్యమని ముఖ్యమంత్రిగారు చెప్తున్నారు. ఓట్ల కోసం మడమ తిప్పే నాయకుడు కదా, ఎంతకైనా దిగజారుతారు అంటూ ఘాటుగా ట్వీట్ చేశాడు. అంతే కాదు..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 ఆగస్టు 2019న వెలువరించిన గెజిట్ నోట్‌ను కూడా లోకేష్ పోస్ట్ చేశాడు.దీంతో తెలుగు తమ్ముళ్లు మా చినబాబుకు చేతికి జగన్ భలే చిక్కాడులే అంటూ సంబరాలు చేసుకున్నారు.
ఇక్కడే లోకేష్ మరోసారి నెట్‌జన్లకు అడ్డంగా దొరికిపోయాడు. లోకేష్ పోస్ట్ చేసిన గెజిట్ నోట్ నిజానికి ఎన్ఆర్సీకి సంబంధించింది కాదు. ఇంటింటికి తిరిగి జనాభా లెక్కలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు సంబంధించి…రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్‌పీ సిసోడియా పేరుతో విడుదల చేసిన గెజిట్ నోట్ అది. . ఆ నోట్‌లో 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఇంటింటికి తిరిగి జనాభా లెక్కలు చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయే తప్పా..ఎక్కడా ఎన్‌ఆర్సీకి సంబంధించిన అంశాలు లేవు. అసలు విషయం ఇది..లోకేష్ మాత్రం గెజిట్ నోట్‌ను సరిగా అర్తం చేసుకోక…చూడండి..ఓట్ల కోసం మడమ తిప్పే నాయకుడు ఎంతకైనా దిగజారుతారంటూ అంటూ తలాతోక లేని ట్వీట్ చేసి నవ్వుల పాలయ్యాడు. పాపం లోకేష్…జగన్‌ను బద్నాం చేయబోయి మరోసారి నెట్‌జన్లకు అడ్డంగా దొరికిపోయింది. దీంతో నెట్‌జన్లు పప్పు..మాలోకం..ఒకసారి గెజిట్ నోట్ చదువు..నీకు తెలుగే కాదు..ఇంగ్లీష్ కూడా రాదా..నిజంగా పప్పు అని మరోసారి నిరూపించుకున్నావు అంటూ తెగ సెటైర్లు వేశారు.