ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లు నీచ రాజకీయం చేస్తున్నారు. అమరావతిలో ప్రాంతంలో తమ సామాజికవర్గానికి చెందిన రైతులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను రెచ్చగొడుతూ బాబు, లోకేష్‌లు పబ్బం గడపుకుంటున్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో జ్యుడిషియల్ రాజధాని వద్దు..అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని చంద్రబాబు, లోకేష్‌లు వాదిస్తున్నారు. తాజాగా మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అనే నినాదాన్ని టీడీపీ ఎత్తుకుంది. అమరావతి ప్రాంతంలో ఒక వర్గం రైతులు, యువత నిర్వహించిన కాగడాల ర్యాలీలో లోకేష్ స్వయంగా పాల్గొని మూడు రాజధానులు వద్దు..అమరావతి ఒక్కటే ముద్దు అంటూ నినదించారు. టీడీపీ శ్రేణులు ఈ నినాదాన్ని హోరెత్తించాయి. అయితే కేవలం తమ సామాజికవర్గమే తప్పా..మిగిలిన సామాజికవర్గాల గురించి బాబు, లోకేష్‌లు పట్టించుకోవడం లేదు..ఎంతసేపూ అమరావతిలో తమ సామాజికవర్గీయుల భూములకు ఎక్కడ విలువ పడిపోతుందనే భయంతో నే రాజధానిలో ఆందోళలను టీడీపీ రెచ్చగొడుతోంది. చంద్రబాబు రాయలసీమ, ఉత్తరాంధ్రల భవిష్యత్తు కంటే..అమరావతిలో తనకు ఒనగూరే స్వప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. అమరావతినే పూర్తి స్థాయిగా రాజధానిగా చేయాలని బాబు, లోకేష్‌లు పనిగట్టుకుని రాజధాని ప్రాంత ప్రజల్లో సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ, కర్నూలులో రాజధానులు వద్దు..అన్నీ అమరావతిలోనే ఉండాలన్నట్లుగా చంద్రబాబు కుటిల రాజకీయం చేస్తున్నాడు. అందుకే టీడీపీ కర్నూలు, విశాఖ నగరాల అభివృద్ధిని అడ్డుకునేలా మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు నినాదాన్ని భుజానికెత్తుకుంది. ఈ మేరకు తనను కలిసిన తన సామాజికవర్గానికి చెందిన రైతులతో చంద్రబాబు మాట్లాడుతూ..రాష్ట్రమంతటా జేఏసీలుగా ఏర్పడి..మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతినే పూర్తి స్థాయి రాజధానిగా ఉంచాలనే డిమాండ్‌తో ఉద్యమాన్ని రగిలించాలని పిలుపునిచ్చాడు. మొత్తంగా పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సమాయాత్తం అవుతుంటే చంద్రబాబు మాత్రం కేవలం తన కుల ఆధిపత్యం కోసం ప్రాంతాల మధ్య విబేధాలు రగిలించేందుకు కూడా వెనుకాడడం లేదు..అందుకే చంద్రబాబు అంత నీచమైన, కుటిల రాజకీయనాయకుడు దేశంలోనే ఉండడు అని మరోసారి రుజువైంది.
