బంగారు తెలంగాణలో రాబోవు తరాలకు బంగారు ఆరోగ్య భవిష్యత్ ను అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న పథకం కేసీఆర్ కిట్లు. రాష్ట్రంలో ఉన్న సర్కారు ఆసుపత్రులల్లో ప్రసవాల సంఖ్యను పెంచడం.. మాతా శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న పథకానికి రూపకల్పన చేసింది.
ఇప్పటివరకు కేసీఆర్ కిట్లు సత్ఫలితాలను ఇచ్చింది. ఈ పథకం అమలు అయిన నాటి మాతా శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. ప్రభుత్వ ఆసుపత్రులల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. గతంలో సర్కారు దవఖానాల్లో ప్రసవాల శాతం కేవలం ఇరవై శాతమే ఉండగా తెలంగాణలో దీని శాతం అరవై రెండు శాతానికి పెరిగింది.
సరిగ్గా రెండు ఏళ్ళ కిందట అంటే 2017లో జూన్ మూడో తారీఖున కేసీఆర్ కిట్ల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 5,89,818మంది బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశారు.
ఇందుకు ప్రభుత్వం రూ.620.41కోట్లను ఖర్చు చేసింది. ఈ పథకం ప్రారంభం కాకముందు రాష్ట్రంలో రెండు లక్షల ప్రసవాలు జరిగితే ఈ పథకం ప్రారంభమైన తర్వాత 2016-17ఆర్థిక సంవత్సరంలో 2,09,130,2017-18ఆర్థిక సంవత్స్రరంలో 2,80,823,2018-19లో 2,90,001ప్రసవాలు ప్రభుత్వాఅసుపత్రులల్లో జరిగాయి.