పిల్లల కు అర్థమయ్యేలా పాఠాలు చెప్పటం కోసం ఒక్కొక్కరు ఒక్కోలాంటి ప్రయత్నం చేస్తారు. కానీ.. ఎవరూ కూడా స్పెయిన్ కు చెందిన వెరోనికా లాంటి టీచరమ్మను మాత్రం ఎవరూ చూసి ఉండరు. పదిహేనేళ్లుగా టీచర్ గా పని చేస్తున్న ఆమె.. తన క్లాస్ పిల్లలకు పాఠం బాగా అర్థం అయ్యేందుకు వీలుగా ఆమె చేసిన ప్రయోగం ఇప్పుడు అందరిని ఆకర్షించటమే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.
షాకింగ్ డ్రెస్సు వేసుకొని క్లాసు లో పాఠాలు చెప్పే ఈ టీచరమ్మ ప్రయోగాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఇంతకీ వెరోనికా టీచరమ్మ వేసుకొచ్చే డ్రెస్సు ఏమిటంటే.. సైన్స్ టీచరుగా పిల్లలకు అనాటమీ క్లాస్ తీసుకునేందుకు బాడీ సూట్ ధరించి క్లాస్ కు వెళతారు. ఆ సూట్ మీద అంతర్గతంగా మానవ అవయువాలు ఎలా ఉంటాయో.. అచ్చు గుద్దినట్లు గా ఏ ప్లేస్ లో ఏం ఉంటాయో.. సరిగ్గా అలానే డ్రెస్ మీద ప్రింట్ అయి ఉంటాయి.
దీంతో..పాఠంలో టీచర్ చెప్పే అంశాలు ఆమె డ్రెస్ రూపంలో కళ్ల ముందు కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటంతో పాఠాలు ఇట్టే అర్థం చేసుకోవటంతో పాటు.. లోపల బాడీ పార్ట్స్ ఎలా ఉంటాయన్న విషయం ఇట్టే బోధ పడుతుంది. 43 ఏళ్ల వెరోనికా అనుసరిస్తున్న పద్దతి ఇప్పుడు వైరల్ గా మారింది.
మరి.. ఇంతకాలం ఈ విషయం ప్రపంచానికి ఎందుకు తెలీలేదు? ఇప్పుడే ఎందుకు తెలిసిందంటే.. అందుకు కారణం వెరోనికా భర్తనే చెప్పాలి. తాజాగా ఆమె క్లాస్ లో పిల్లలకు పాఠాలు చెప్పే విధానం గురించి సోషల్ మీడియా లో వెల్లడించటం తో పాటు.. అందుకు తగ్గట్లు ఫోటోల్ని తీస పోస్టు చేశారు. దీంతో.. ఆమెకు సంబంధించి పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.