జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మనకు నిఖార్సయిన నాయకుడు కేటీఆర్ ఉన్నాడనీ.. అతని అడుగుజాడలో నడిచి, ఆయన సూచన మేరకు నడుచుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో విజయం పెద్ద కష్టమేమి కాదన్నారు.
సీఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న మంత్రి.. 70 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో చేయని పనులన్నీ ఈ 5 సంవత్సరాలలో చేసి చూపించామని తెలిపారు. తెలంగాణలో ప్రజలంతా టీఆరెస్ వైపే ఉన్నారని.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.