ఆంద్రప్రదేశ్ రాజధాని అంశం మెగా కుటుంబంలో మళ్లీ కలహాలకు కారణమైందా ? అన్న చిరంజీవి జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నాడు.. తమ్ముడు పవన్ సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు.. మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తన నిర్ణయాన్ని తన యూట్యూబ్ ఛానల్ లో తెలిపాడు. అమరావతి రైతులకు అన్నాయం చేయద్దని, మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయద్దని నాగబాబు తెలిపారు.
ఇలా ముగ్గురు అన్నదమ్ములు మాట్లాడటంతో రాజకీయంగా మళ్లీ వీరు విడిపోయారా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక పక్క మూడు రాజధానులను ఇద్దరు తమ్ముళ్లు వ్యతిరేకిస్తుంటే చిరంజీవి మాత్రం స్వయాన జగన్ నివాసానికి వెళ్లి అభినందించటం పట్ల జనసేన పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీకి దాదాపు మెగా ఫ్యామిలీ మొత్తం దూరంగానే ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలోనే నాగబాబు జనసేనకు దగ్గరై పార్టీ తరపున ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయాడు. చిరంజీవి మాత్రం ఎప్పడు జనసేన ను సమర్దిస్తు గానీ వ్యతిరేకిస్తు గానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ నాగబాబు మాత్రం జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తు పవన్ కళ్యాణ్ వెంట ఉంటున్నాడు . ఈ క్రమంలోనే తెరపైకి వచ్చిన మూడు రాజధానుల అంశం తో మరో సారి మెగా ఫ్యామిలీలో విబేధాలు తలెత్తాయంటు సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్తున్నాయి. చిరంజీవి స్వయంగా వెళ్లి జగన్ కలసి సీఎం నిర్ణయాలను సమర్ధించటంతో అన్నదమ్ముల మద్య విబేదాలు నిజమే నంటు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు వీడియో చేశారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బందికి గురిచేయడం సరికాదని, రాజధాని రైతులకు స్పష్టత ఇచ్చి వారికి అండగా నిలవాలని నాగబాబు కోరారు.