చలికాలంలో మనకు ఎక్కువగా లభించే వాటిలో ప్రధానమైనవి ఉసిరికాయలు.ఉసిరికాయలను కూరగా తినోచ్చు.. పచ్చడి చేసుకుని తినోచ్చు.
ఉసిరికాయలను తింటే పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉండోచ్చంటున్నారు పరిశోధకులు.మరి చలికాలంలో ఉసిరికాయలను తింటే లాభాలెంటో తెలుసుకుందామా..?.
* ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సీ వలన చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు
* నారింజ,నిమ్మ,దానిమ్మ కాయల కన్నా ఎక్కువగా విటమిన్ సీ ఉసిరికాయల్లోనే దొరుకుతుంది
* అందువల్ల ఈ సీజన్లో ఉసిరికాయలను తీసుకుంటే విటమిన్ సీ లోపం రాకుండా చూసుకోవచ్చు
*ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సీ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
* దగ్గు ,జలుబు,ఫ్లూ జ్వరం రాకుండా చూస్తుంది
* శీతాకాలంలో మందగించే జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసి ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది
*డయాబెటిస్ ఉన్నవారు ఉసిరికాయలను తినడం వలన కావాల్సినంత క్రోమియం లభిస్తుంది
* దీంతో ఇన్సులిన్ చురుగ్గా పని చేస్తుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి
* శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యలు తగ్గాలంటే ఉసిరికాయ రసాన్ని నిత్యం వాడాలి
* ఉసిరికాయ రసాన్ని తాగడం వలన వెంట్రుకల సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది